|
||
| Previous | ||
| లేవీయకాండము 08 అధ్యాయము | ||
8 మరియు యెహోవా | 2 -నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థబలి రూపమైన కోడెను రెండు పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసికొని | 3 ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును సమకూర్చుమనగా | 4 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా | 5 మోషే సమాజముతో-చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. | 6 అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసికొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. | 7 తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టీని కట్టి నిలువుటంగీని, ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి, అతనికి పతకమువేసి | 8 ఆ పతకములో ఊరీము తువ్మిూమను వాటిని ఉంచి | 9 అతని తలవిూద పాగాను పెట్టి, ఆ పాగా విూదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 10 మరియు మోషే అభిషేక తైలమును తీసికొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. | 11 అతడు దానిలో కొంచెము ఏడుమారులు బలిపీఠము విూద ప్రోక్షించి, బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభి షేకించెను. | 12 మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తలవిూద పోసి అతని ప్రతిష్ఠించు టకై అతనిని అభిషేకించెను. | 13 అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 14 అప్పుడతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును పాపపరిహారార్థబలి రూపమైన ఆ కోడె తలవిూద తమ చేతులుంచిరి. | 15 దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను. | 16 మోషే ఆంత్రముల విూది క్రొవ్వంతటిని కాలేజము విూది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము విూద దహించెను. | 17 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను. | 18 తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలి తలవిూద తమ చేతులుంచిరి. | 19 అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షించెను. | 20 అతడు ఆ పొట్టేలు యొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను. | 21 అతడు దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడిగి, ఆ పొట్టేలంతయు బలిపీఠము విూద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది యింపైన సువాసనగల దహనబలి ఆయెను. అది యెహో వాకు హోమము. | 22 అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని రాగా అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలవిూద తమ చేతులుంచిరి. | 23 మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనవిూదను అతని కుడిచేతి బొట్టనవ్రేలి విూదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనవిూదను దాని చమిరెను. | 24 మోషే అహరోను కుమా రులను దగ్గరకు తీసికొనివచ్చి, వారి కుడిచెవుల కొనల విూదను వారి కుడిచేతుల బొట్టన వ్రేలివిూదను వారి కుడికాళ్ల బొట్టన వ్రేలివిూదను ఆ రక్తములో కొంచెము చమిరెను. మరియు మోషే బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షించెను. | 25 తరువాత అతడు దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రము విూది క్రొవ్వంతటిని కాలేజము విూది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి క్రొవ్వును కుడి జబ్బను తీసి | 26 యెహోవా సన్నిధిని గంపెడు పులియని భక్ష్యములలో నుండి పులియని యొక పిండివంటను నూనె గలదై పొడిచిన యొక భక్ష్యమును ఒక పలచని అప్పడమును తీసి, ఆ క్రొవ్వువిూదను ఆ కుడి జబ్బవిూదను వాటిని ఉంచి | 27 అహరోను చేతుల విూదను అతని కుమారుల చేతుల విూదను వాటన్నిటిని ఉంచి, అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడించెను. | 28 అప్పుడు మోషే వారి చేతుల విూదనుండి వాటిని తీసి బలిపీఠము విూదనున్న దహనబలి ద్రవ్యము విూద వాటిని దహించెను. అవి యింపైన సువాసనగల ప్రతిష్ఠార్పణలు. అది యెహోవాకు హోమము. | 29 మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణ రూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. | 30 మరియు మోషే అభిషేక తైలములో కొంతయు బలిపీఠము విూది రక్తములో కొంతయు తీసి, అహరోను విూదను అతని వస్త్రముల విూదను అతని కుమారుల విూదను అతని కుమారుల వస్త్రముల విూదను దానిని ప్రోక్షించి, అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. | 31 అప్పుడు మోషే అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనెను-ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఆ మాంసమును వండి, అహరోనును అతని కుమారులును తినవలెనని నేను ఆజ్ఞాపించినట్లు అక్కడనే దానిని, ప్రతిష్ఠిత ద్రవ్యములుగల గంపలోని భక్ష్యములను తినవలెను. | 32 ఆ మాంసములోను భక్ష్యములోను మిగిలినది అగ్నిచేత కాల్చివేయవలెను. | 33 విూ ప్రతిష్ఠ దినములు తీరు వరకు ఏడు దినములు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నుండి బయలువెళ్లకూడదు; ఏడు దినములు మోషే విూ విషయములో ఆ ప్రతిష్ఠను చేయుచుండును. | 34 విూ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను. | 35 విూరు చావకుండునట్లు విూరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడు దినముల వరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. | 36 యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన వన్ని అహరోనును అతని కుమారులును చేసిరి. |
||
| Previous | ||