|
||
| Previous | ||
| లేవీయకాండము 05 అధ్యాయము | ||
5 ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచిన దాని గూర్చిగాని తనకు తెలిసిన దానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసిన యెడల అతడు తన దోషశిక్షను భరించును. | 2 మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన యెడల, అది అపవిత్ర మృగ కళేబరమేగాని అపవిత్ర పశుకళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. | 3 మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటిన యెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన యెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధియగును. | 4 మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్ధముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరిదైనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టుపెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. | 5 కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని | 6 తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొఱ్ఱెపిల్లనేగాని ఆడు మేకపిల్లనేగాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. | 7 అతడు గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను. | 8 అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాపపరిహారార్థమైన దానిని మొదట నర్పించి, దాని మెడనుండి దాని తలను నులమవలెనుగాని దాని నూడదీయకూడదు. | 9 అతడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాపపరిహారార్థబలి. | 10 విధి చొప్పున రెండవ దానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. | 11 రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని యెడల పాపము చేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాపపరిహారార్థబలి గనుక దానివిూద నూనె పోయవలదు. సాంబ్రాణి దానివిూద ఉంచవలదు. | 12 అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠము విూద దానిని దహింపవలెను. అది పాపపరిహారార్థబలి. | 13 పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసినవాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును. | 14 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 15 -ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరబాటున పాపము చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్ధబలిగా యెహోవా యొద్దకు వాడు తీసికొని రావలెను. | 16 పరిశుద్ధమైన దాని విషయ ములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో అయిదవ వంతు యాజకునికియ్యవలెను. ఆ యాజకుడు అపరాధపరిహారార్థబలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. | 17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపియైన యెడల అది పొరబాటున జరిగినను అతడు అపరాధియైన తన దోషమునకు శిక్ష భరించును. | 18 కావున నీవు ఏర్పరచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధపరిహారార్థబలిగా అతడు యాజకుని యొద్దకు తీసికొని రావలెను. అతడు తెలియకయే పొరబాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. | 19 అది అపరాధపరిహారార్థబలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. |
||
| Previous | ||