|
||
| Previous | ||
| లేవీయకాండము 06 అధ్యాయము | ||
6 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 2 -ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపియైన యెడల, అనగా తనకు అప్పగింపబడినదాని గూర్చియేగాని తాకట్టు ఉంచినదాని గూర్చియేగాని, దోచుకొనినదాని గూర్చియేగాని, తన పొరుగువానితో బొంకిన యెడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన యెడలనేమి | 3 పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకిన యెడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన యెడలనేమి | 4 అతడు పాపముచేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చిగాని బలాత్కారము చేతను అపహరించినదాని గూర్చిగాని తనకు అప్పగింపబడినదాని గూర్చిగాని, పోయి తనకు దొరికినదాని గూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను. | 5 ఆ మూల ధనమునిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధపరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. | 6 అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకుని యొద్దకు తీసికొని రావలెను. | 7 ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విష యమై అతనికి క్షమాపణ కలుగును. | 8 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 9 -నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము -ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉద యము వరకు రాత్రి అంతయు బలిపీఠము విూద దహించుచుండును; బలిపీఠము విూది అగ్ని దానిని దహించుచుండును. | 10 యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపీఠము విూద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి | 11 తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొని పోవలెను. | 12 బలిపీఠము విూద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని విూద కట్టెలు వేసి, దాని విూద దహనబలి ద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. | 13 బలిపీఠము విూద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. | 14 నైవేద్యమును గూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను. | 15 అతడు నైవేద్య తైలమునుండియు దాని గోధుమపిండి నుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము విూద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. | 16 దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను; | 17 దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము. | 18 అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో విూ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. | 19 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 20 -అహరోనుకు అభిషేకము చేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు. | 21 పెనము విూద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చిన తరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. | 22 అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను. | 23 యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు. | 24 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను | 25 -నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఈలాగు ఆజ్ఞాపించుము - పాపపరిహారార్థబలిని గూర్చిన విధి యేదనగా, నీవు దహనబలి రూపమైన పశువులను వధించు చోట పాపపరిహారార్థబలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను; అది అతిపరిశుద్ధము. | 26 పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. | 27 దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము విూద ప్రోక్షించిన యెడల అది దేనివిూద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధస్థలములో ఉదుకవలెను. | 28 దాని వండిన మంటికుండను పగులగొట్టవలెను; దానిని ఇత్తడి పాత్రలో వండిన యెడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. | 29 యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. | 30 మరియు పాపపరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచెమైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. |
||
| Previous | ||