|
||
| Previous | ||
| లేవీయకాండము 03 అధ్యాయము | ||
3 అతడు అర్పించునది సమాధానబలియైన యెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చిన యెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొని రావలెను. | 2 తాను అర్పించు దాని తలవిూద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. | 3-4 అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల విూది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటివిూద డొక్కల విూదనున్న క్రొవ్వును కాలేజము విూదను మూత్రగ్రంధుల విూదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. | 5 అహరోను కుమారులు బలిపీఠము విూద, అనగా అగ్నివిూద కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. | 6 యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱెమేకలలోనిదైన యెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను | 7 అతడర్పించు అర్పణము గొఱ్ఱెపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. | 8 తాను అర్పించు దాని తలవిూద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. | 9 ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల విూది క్రొవ్వు అంతటిని | 10 రెండు మూత్ర గ్రంధులను వాటివిూది డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంధులవిూది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. | 11 యాజకుడు బలి పీఠమువిూద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. | 12 అతడు అర్పించునది మేకయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను. | 13 తాను దాని తలవిూద చెయ్యి ఉంచి ప్రత్య క్షపు గుడారమునెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను. | 14 తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల విూది క్రొవ్వు అంతటిని | 15 రెండు మూత్ర గ్రంధులను వాటివిూది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్రగ్రంధులపైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. | 16 యాజకుడు బలిపీఠము విూద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమరూపమైన ఆహారము. విూరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. | 17 అది విూ తరతరములకు విూ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ. |
||
| Previous | ||