BLM
 

 
Previous
  లేవీయకాండము 02 అధ్యాయము  

2 ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానివిూద నూనెపోసి సాంబ్రాణి వేసి | 2 యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠము విూద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవలెను. | 3 ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము. | 4 నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములేగాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను. | 5 నీ అర్పణము పెనము విూద కాల్చిన నైవేద్యమైన యెడల అది నూనె కలిపినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను. | 6 అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి విూద నూనె పోయవలెను. | 7 నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన యెడల నూనె కలిపిన గోధుమపిండితో దానిని చేయవలెను. | 8 వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. | 9 అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాప కార్థముగా తీసి బలిపీఠము విూద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను. | 10 ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.| 11 విూరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. | 12 ప్రధమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠము విూద ఇంపైన సువాసనగా వాటి నర్పింపవలదు. | 13 నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము విూద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను. | 14 నీవు యెహోవాకు ప్రధమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రధమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. | 15 అది నైవేద్యరూపమైనది, నీవు దానివిూద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను. | 16 అందులో జ్ఞాపకార్ధమైన భాగమును, అనగా విసిరిన ధాన్యములో కొంతయు, నూనెలో కొంతయు, దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము.

Previous