BLM
 

 
Previous
  ఆదికాండము 50 అధ్యాయము  

50 యోసేపు తన తండ్రి ముఖము విూద పడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దు పెట్టుకొనెను. | 2 తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. | 3 సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి. | 4 అతని గూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి-విూ కటాక్షము నా విూదనున్న యెడల విూరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి | 5 -నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి-ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్ట వలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను. | 6 అందుకు ఫరో-అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. | 7 కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును | 8 యోసేపు యింటి వారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటి వారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి. | 9 మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. | 10 యొర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోహముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను. | 11 ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి-ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్1 మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతలనున్నది. | 12 అతని కుమారులు తన విషయమై అతడు వారి కాజ్ఞాపించినట్లు చేసిరి. | 13 అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. 14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టినతరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. 15 యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి-ఒకవేళ యోసేపు మనయందు పగపట్టి మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని | 16 యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి | 17 -నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా-విూరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను. | 18 మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి-ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా | 19 యోసేపు-భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? | 20 విూరు నాకు కీడు చేయనుద్దేశింతిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. | 21 కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును విూ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. 22 యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రతికెను. | 23 యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరు నకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. | 24 యోసేపు తన సహోదరులను చూచి-నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములో నుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి యిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను. | 25 మరియు యోసేపు -దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు విూరు నా యెముకలను ఇక్కడ నుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. | 26 యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతిపొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

1. అనగా, ఐగుప్తీయుల దుఃఖము.
Previous