BLM
 

 
Previous
  ఆదికాండము 48 అధ్యాయము  

48 ఈ సంగతులైన తరువాత-ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎప్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, | 2 ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము విూద కూర్చుండెను. | 3 యోసేపును చూచి- కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి | 4 -ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. | 5 ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు. | 6 వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. | 7 పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. | 8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి-వీరెవరని అడుగగా | 9 యోసేపు-వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్రహించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు-నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొని రమ్మనెను. | 10 ఇశ్రాయేలు కన్నులు వృద్దాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసికొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. | 11 ఇశ్రాయేలు యోసేపుతో-నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచి యున్నాడనగా | 12 యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. | 13 తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి తట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేత తట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొని వచ్చెను. | 14 మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల విూద తన కుడిచేతిని మనష్షే తల విూద తన యెడమ చేతిని ఉంచెను. | 15 అతడు యోసేపును దీవించి-నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, | 16 అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించును గాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పెను. | 17 యోసేపు ఎఫ్రాయిము తల విూద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలవిూద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల విూద నుండి యెత్తి | 18 -నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలవిూద పెట్టుమని చెప్పెను. | 19 అయినను అతని తండ్రి ఒప్పక-అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. | 20 ఆ దినమందు అతడు వారిని దీవించి-ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయునుగాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగదు అతడు మనష్షే కంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. | 21 మరియు ఇశ్రాయేలు-ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు విూకు తోడైయుండి విూ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును. | 22 నేను నీ సహోదరుల కంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయులు చేతిలో నుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

Previous