BLM
 

 
Previous
  ఆదికాండము 47 అధ్యాయము  

47 యోసేపు వెళ్లి ఫరోను చూచి-నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి | 2 తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. | 3 ఫరో అతని సహోదరులను చూచి-విూ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు-నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి. | 4 మరియు వారు-కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా | 5 ఫరో యోసేపును చూచి-నీ తండ్రియు నీ సహోదరులును నీ యొద్దకు వచ్చియున్నారు. | 6 ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింప వచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచిన యెడల నా మందల విూద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. | 7 మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతనినుంచగా యాకోబు ఫరోను దీవించెను. | 8 ఫరో- నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు | 9 యాకోబు-నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి | 10 ఫరోను దీవించి ఫరో యెదుట నుండి వెళ్లిపోయెను. | 11 ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను. | 12 మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరిని వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. 13 కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. | 14 వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. | 15 ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి-మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. | 16 అందుకు యోసేపు-విూ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయిన యెడల విూ పశువులకు ప్రతిగా నేను విూకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసికొని వచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను. | 17 ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. | 18 ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి-ఇది మా యేలిన వారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలిన వారి సముఖమున మిగిలియుండలేదు. | 19 నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. | 20 అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయెను. | 21 అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క యీ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను. | 22 యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెము వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. 23 యోసేపు-ఇదిగో నేడు మిమ్మును విూ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో విూకు విత్తనములు; పొలములలో విత్తుడి. | 24 పంటలో అయిదవ భాగము విూరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములో విత్తుటకును విూకును విూ కుటుంబపు వారికిని ఆహారమునకును విూ పిల్లలకు ఆహారమునకును విూవై యుండునని ప్రజలతో చెప్పగా | 25 వారు-నీవు మమ్ము బ్రతికించితివి, ఏలినవారి కటాక్షము మా విూద నుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి. | 26 అప్పుడు అయిదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు. | 27 ఇశ్రాయేలీ యులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. 28 యాకోబు ఐగుప్తు దేశములో పదునేడు సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు. | 29 ఇశ్రాయేలు చావవలసిన దినములు సవిూపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి-నా యెడల నీకు కటాక్షమున్న యెడల దయచేసి నీ చెయ్యి నా తొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. | 30 నా పితరులతో కూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. | 31 అందుకతడు-నేను నీ మాట చొప్పున చేసెదననెను. మరియు అతడు-నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి విూద వంగి దేవునికి నమస్కారము చేసెను.

Previous