BLM
 

 
Previous
  ఆదికాండము 46 అధ్యాయము  

46 అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలుల నర్పించెను. | 2 అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు-యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు-చిత్తము ప్రభువా అనెను. | 3 ఆయన-నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. | 4 నేను ఐగుప్తునకు నీతో గూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నుల విూద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా | 5 యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్ల విూద ఇశ్రాయేలు కుమారులు తన తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. | 6 వారు, అనగా యాకోబు అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి. | 7 అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడ తీసికొని వచ్చెను. 8 యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే; | 9 యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ. | 10 షిమ్యోను కుమారులైన యెమూయేలు యావిూను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు. | 11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి | 12 యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు. | 13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను. | 14 జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు. | 15 వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు. | 16 గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరి ఆరోదు అరేలి. | 17 ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు. | 18 లాబాను తన కుమార్తెయైన లేయాకిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను. | 19 యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యావిూను. | 20 యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను. | 21 బెన్యావిూను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు | 22 యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు. | 23 దాను కుమారుడైన హుషీము. | 24 నఫ్తాలి కుమారులైన యహసేలు గూనీ యేసెరు షిల్లేము. | 25 లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు. | 26 యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు. | 27 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బది మంది. 28 అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా | 29 యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడ విూదపడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను. | 30 అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో-నీవింక బ్రతికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను. | 31 యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని చూచి-నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనాను దేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి; | 32 ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొని వచ్చిరని అతనితో చెప్పెదను. | 33 గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి విూ వృత్తి యేమిటని అడిగిన యెడల | 34 విూరు గోషెను దేశమందు కాపురముండునట్లు-మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.

Previous