BLM
 

 
Previous
  ఆదికాండము 45 అధ్యాయము  

45 అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక-నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండ లేదు. | 2 అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి. | 3 అప్పుడు యోసేపు-నేను యోసేపును; నా తండ్రి యింకను బ్రతికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. | 4 అంతట యోసేపు-నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు- ఐగుప్తునకు వెళ్లునట్లు విూరు అమ్మివేసిన విూ సహోదరుడైన యోసేపును నేనే. | 5 అయినను నేనిక్కడికి వచ్చునట్లు విూరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది విూకు సంతాపము పుట్టింపనియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు విూకు ముందుగా నన్ను పంపించెను. | 6 రెండు సంవత్సరముల నుండి కరవు దేశములో నున్నది. సేద్యమైనను కోతయైననులేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును | 7 ప్రాణముతో కాపాడుటకును దేవుడు విూకు ముందుగా నన్ను పంపించెను. | 8 కాబట్టి దేవుడేగాని విూరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి విూద ఏలికగాను నియమించెను. | 9 విూరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో-నీ కుమారుడైన యోసేపు- దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు; | 10 నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెల మందలను నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సవిూపముగా నుండును. | 11 ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము లేకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి. | 12 ఇదిగో విూతో మాటలాడుచున్నది నా నోరే అని విూ కన్నులును నా తమ్ముడైన బెన్యావిూను కన్నులును చూచుచున్నవి. | 13 ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, విూరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి | 14 తన తమ్ముడైన బెన్యావిూను మెడవిూద పడి యేడ్చెను; బెన్యావిూను అతన అతని మెడవిూద పడి యేడ్చెను. | 15 అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వార విూద పడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. 16 యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా నుండెను. | 17 అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను-నీవు నీ సహోదరులను చూచి-విూరీలాగు చేయుడి, విూ పశువుల విూద బరువులుకట్టి కనాను దేశ మునకు వెళ్లి | 18 విూ తండ్రిని విూ యింటి వారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను విూకిచ్చెదను, ఈ దేశము యొక్క సారమును విూరు అనుభవించెదరు. | 19 నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, విూ పిల్లల కొరకును విూ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసికొనిపోయి విూ తండ్రిని వెంటబెట్టుకొని రండి. | 20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు విూవే అగును గనుక విూ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా | 21 ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను. | 22 అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యావిూనుకు మూడు వందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను, | 23 అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను. | 24 అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా-మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను. | 25 వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తమ తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి | 26 యోసేపు ఇంక బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. | 27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. | 28 అప్పుడు ఇశ్రాయేలు-ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రతికియున్నాడు, నేను చావక మునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

Previous