BLM
 

 
Previous
  ఆదికాండము 44 అధ్యాయము  

44 యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్ధములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు, | 2 కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహనిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. 3 తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతో కూడ పంపివేయబడిరి. | 4 వారు ఆ పట్టణము నుండి బయలుదేరి యెంతో దూరము వెళ్లక మునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి - నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని-విూరు మేలుకు కీడు చేయనేల? | 5 దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? విూరు దీని చేయుట వలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను. | 6 అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు | 7 వారు-మా ప్రభువు ఇట్లు మాట లాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. | 8 ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసికొని వచ్చితిమి; నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము? | 9 నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి. | 10 అందుకతడు-మంచిది; విూరు చెప్పినట్టే కానీ యుడి ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసు డగును; అయితే విూరు నిర్దోషులగుదురని చెప్పెను. | 11 అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. | 12 అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యావిూను గోనెలో దొరికెను. | 13 కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద విూద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. | 14 అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను. గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి. | 15 అప్పుడు యోసేపు-విూరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని విూకు తెలియదా అని వారితో అనగా | 16 యూదా యిట్లనెను-ఏలినవారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను. | 17 అందుకతడు-అట్లు చేయుట నాకు దూరమవును గాక; ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును విూరు విూ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా | 18 యూదా అతని సవిూపించి-ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసుని విూద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారు గదా | 19 ఏలినవాడు-విూకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను. | 20 అందుకు మేము-మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. | 21 అప్పుడు తమరు-నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి. | 22 అందుకు మేము-ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని యేలిన వారితో చెప్పితిమి. | 23 అందుకు తమరు-విూ తమ్ముడు విూతో రాని యెడల విూరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. | 24 కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలిన వారి మాటలను అతనికి తెలియచేసితిమి. | 25 మా తండ్రి-విూరు తిరిగి వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు | 26 మేము-అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతో కూడ ఉండిన యెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనేగాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి. | 27 అందుకు తమ దాసుడైన నా తండ్రి-నా భార్య నాకిద్దరిని కనెనని విూరెరుగుదురు. | 28 వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగములచేత చీల్చబడెననుకొంటిని, అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. | 29 విూరు నా యెదుట నుండి ఇతని తీసికొని పోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. | 30 కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేనియెడల | 31 అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలుగల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. | 32-33 తమ దాసుడనైన నేను ఈ చిన్న వానిని గూర్చి నా తండ్రికి పూటపడి-నీ యొద్దకు నేనతని తీసికొని రాని యెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా విూద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము. | 34 ఈ చిన్నవాడు నాతో కూడ లేని యెడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లిన యెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.

Previous