BLM
 

 
Previous
  ఆదికాండము 43 అధ్యాయము  

43 ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక | 2 వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి-విూరు మరల వెళ్లి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా | 3 యూదా అతని చూచి-ఆ మనుష్యుడు విూ తమ్ముడు విూతో ఉంటేనే గాని విూరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. | 4 కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీ కొరకు ఆహారము కొందుము. | 5 నీవు వానిని పంపనొల్లని యెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు-విూ తమ్ముడు విూతో లేని యెడల విూరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను. | 6 అందుకు ఇశ్రాయేలు-విూకు ఇంకొక సహోదరుడు కలడని విూరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా | 7 వారు-ఆ మనుష్యుడు-విూ తండ్రి యింక సజీవుడైయున్నాడా? విూకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియ చెప్పితిమి-విూ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి. | 8 యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి- ఆ చిన్న వానిని నాతో కూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము; | 9 నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి న్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీ యొద్దకు తీసికొని వచ్చి నీ యెదుట నిలువబెట్టని యెడల ఆ నింద నా విూద ఎల్లప్పుడు ఉండును. | 10 మాకు తడవు కాకపోయిన యెడల ఈ పాటికి రెండవమారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా | 11 వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితో-అట్లయిన విూరీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైన, అనగా కొంచెము మస్తకి కొంచెను తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు విూ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి. | 12 రెట్టింపు రూకలు విూరు తీసికొనుడి, విూ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడ చేత పట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును; | 13 విూ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి. | 14 ఆ మనుష్యుడు విూ యితర సహోదరుని బెన్యావిూనును విూకప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసిన యెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. 15 ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యావిూనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి. | 16 యోసేపు వారితోనున్న బెన్యావిూనును చూచి తన గృహనిర్వాహకునితో-ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను. | 17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను. | 18 ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి- మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన విూదికి అకస్మాత్తుగా వచ్చి విూదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి. 19 వారు యోసేపు గృహనిర్వాహకుని యొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడు | 20 -అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. | 21 అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి. | 22 ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. | 23 అందుకతడు-విూకు క్షేమమగును గాక భయపడకుడి; విూ పితరుల దేవుడైన విూ దేవుడు విూకు విూ గోనెలలో ధనమిచ్చెను. విూ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసికొని వచ్చెను. | 24-25 ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. | 26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. | 27 అప్పుడు -విూరు చెప్పిన ముసలివాడైన విూ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికియున్నాడా? అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు | 28 -నీ దాసుడైన మా తండ్రి యింక బ్రతికియున్నాడు క్షేమముగా నున్నాడని వంగి సాగిలపడిరి. | 29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యావిూనును చూచి- విూరు నాతో చెప్పిన విూ తమ్ముడు ఇతడేనా? అని అడిగి -నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను. | 30 అప్పుడు తన తమ్ముని విూద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. | 31 అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను. | 32 అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలసి భోజనము చేయరు; అది ఐగుప్తీ యులకు హేయము. | 33 జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. | 34 మరియు అతడు తన యెదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యావిూను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.

Previous