|
||
| Previous | ||
| సంఖ్యాకాండము 20 అధ్యాయము | ||
20 మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. | 2 ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. | 3 జనులు మోషేతో వాదించుచు-అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన యెడల ఎంతో మేలు | 4 అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును విూరేల తెచ్చితిరి? | 5 ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి. | 6 అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. | 7 అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను | 8 -నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. | 9 యెహోవా అతని కాజ్ఞా పించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను. | 10 తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలో నుండి విూ కొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను. | 11 అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. | 12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో విూరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి విూరు తోడుకొని పోరని చెప్పెను. | 13 అవి మెరీబా1 జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. | 14 మోషే కాదేషు నుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి-నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా-మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది; | 15 మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. | 16 మేము యెహోవాకు మొఱపెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము. | 17 మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచి పోయెదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ వైపున కైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను. | 18 ఎదోవిూయులు-నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సువిూ అని అతనితో చెప్పగా | 19 ఇశ్రాయేలీయులు-మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు-నీవు రానేకూడదనెను. | 20 అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారికెదురుగా వచ్చెను. | 21 ఎదోము ఇశ్రాయేలు తన పొలి మేరలలో బడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్దనుండి తొలగిపోయిరి. 22 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. | 23 యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. | 24 -అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద విూరు నా మాట వినక నా విూద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. | 25-26 నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ యెక్కి, అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. | 27 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి. | 28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగివచ్చిరి. | 29 అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి. 1. అనగా-వివాదము. |
||
| Previous | ||