BLM
 

 
Previous
  సంఖ్యాకాండము 18 అధ్యాయము  

18 యెహోవా అహరోనుతో ఇట్లనెను-నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును విూ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు | 2 మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను. | 3 వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును విూరును చావకుండునట్లు వారు పరిశుద్ధస్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సవిూపింపవలదు. | 4 వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాని కాపాడవలెను. | 5 అన్యుడు విూ యొద్దకు సవిూపింపకూడదు; ఇకవిూదట విూరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయుల విూదికి కోపము రాదు. | 6 ఇదిగో నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన విూ సహోదరులను తీసికొనియున్నాను; ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన విూకప్పగింపబడియున్నారు. | 7 కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే విూ యాజకత్వపు సేవ నేను విూకిచ్చియున్నాను; అన్యుడు సవిూపించిన యెడల మరణశిక్ష నొందును. | 8 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను-ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను. | 9 అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థబలులన్ని టిలోను, వారి అపరాధపరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధ స్థలములో విూరు వాటిని తినవలెను. | 10 ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును. | 11 మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును. | 12 వారు యెహోవాకు అర్పించు వారి ప్రధమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. | 13 వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రధమ ఫలములు నీవియగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తినవచ్చును. | 14 ఇశ్రాయేలీయులలో విూదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. | 15 మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. | 16 అపవిత్ర జంతువుల తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెల చొప్పున, పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండి యిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు. | 17 అయితే ఆవు యొక్క తొలిచూలిని గొఱ్ఱె యొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠము విూద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెనుగాని వాటి మాంసము నీదగును. | 18 అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును. | 19 ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమైన స్థిరమైన నిబంధన. | 20 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను-వారి దేశ ములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. | 21 ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క థమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. | 22 ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకవిూదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. | 23 అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమియు ఉండదు. ఇది విూ తరతరములకు నిత్యమైన కట్టడ. | 24 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతి ష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. | 25 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. | 26 -నీవు లేవీయులతో ఇట్లనుము - నేను ఇశ్రాయేలీయుల చేత విూకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును విూరు వారి యొద్ద పుచ్చుకొనునప్పుడు విూరు దానిలో, అనగా ఆ దశమభాగములో థమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. | 27 విూకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను. | 28 అట్లు విూరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొను విూ దశమభాగములన్నిటిలో నుండి విూరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి విూరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. | 29 విూకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. | 30 మరియు నీవు వారితో విూరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపు వచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను. | 31 విూరును విూ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో విూరు చేయు సేవకు అది విూకు జీతము. | 32 విూరు దానిలో నుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; విూరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.

Previous