|
||
| Previous | ||
| నిర్గమకాండము 40 అధ్యాయము | ||
40 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను | 2 - మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. | 3 అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. | 4 నీవు బల్లను లోపలికి తెచ్చి దాని విూద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. | 5 సాక్ష్యపు మందసము నెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. | 6 ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము నెదుట దహన బలిపీఠమును ఉంచవలెను; | 7 ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. | 8 తెరల చుట్టు ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. | 9 మరియు నీవు అభిషేక తైలమును తీసికొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. | 10 దహన బలిపీఠమునకు అభిషేకముచేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను, అప్పుడు ఆ పీఠము అతిపరిశుద్ధమగును. | 11 ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకముచేసి దాని ప్రతిష్ఠింపవలెను. | 12 మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొనివచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి | 13 అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకముచేసి అతని ప్రతిష్ఠింపవలెను. | 14 మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి | 15 వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయుము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. | 16 మోషే ఆ ప్రకారము చేసెను; యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను. | 17 రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. | 18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలనువేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబట్టి | 19 మందిరమువిూద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను. | 20 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానివిూద కరుణాపీఠము నుంచెను. | 21 మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. | 22 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపట బల్లను ఉంచి | 23 యెహోవా సన్నిధిని దానివిూద రొట్టెలను క్రమముగా ఉంచెను. | 24 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్లయెదుట దీపవృక్షమును ఉంచి | 25 యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. | 26 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెరయెదుట బంగారు ధూపవేదికను ఉంచి | 27 దాని విూద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. | 28 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి | 29 దానివిూద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. | 30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళణ కొరకు దానిలో నీళ్లు పోసెను. | 31 దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి. | 32 వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును బలిపీఠమునకు సవిూపించునప్పుడును కడుగుకొనిరి. | 33 మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను. | 34 అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా | 35 యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము విూద నిలుచుటచేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను. | 36 మేఘము మందిరము విూదనుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి. | 37 ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముపైకి వెళ్లని యెడల అది వెళ్లు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. | 38 ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము విూద ఉండెను. రాత్రివేళ అగ్ని దానివిూద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. |
||
| Previous | ||