Bible Names Prediction Game - బైబిల్ నేమ్స్ ప్రిడిక్షన్ గేమ్
Bible Names Prediction Game - బైబిల్ నేమ్స్ ప్రిడిక్షన్ గేమ్ 

Bible Names Prediction Game - బైబిల్ నేమ్స్ ప్రిడిక్షన్ గేమ్

  • Rs.150



చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలుకు ఆకర్షించవచ్చును. అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది. అందులో భాగంగానే ఈ “బైబిల్ నేమ్స్ ప్రిడిక్షన్ గేమ్” రూపొందించబడినది. మొత్తం 6 కార్డులలో ఏదైనా ఒక కార్డు చూపించి (నంబర్సు లేని వ్కెపు) ఒక పేరును మనసులోనే ఎన్నుకోమని చెప్పాలి. వారు ఎన్నుకున్న కార్డును పక్కన పెట్టి మిగిలిన 5 కార్డులలో ఒకదాని తర్వాత ఒకటి చూపించి వారు ఎంచుకున్న పేరు ఏ కార్డులో ఉందని చెప్తారో ఆ కార్డులను వారు మొదటగా పేరు ఎంచుకున్న కార్డుతో కలిపి, వారు ఎంచుకున్న పేరు లేని కార్డులను పక్కన పెట్టాలి. (ఒకవేళ వారు ఒక కార్డులో పేరు ఉన్నా కూడా సరిగా గమనించక లేదు అని చెప్తే తప్పు అవుతుంది కనుక జాగ్రత్తగా చూడమని చెప్పాలి) వారు పేరు ఎంచుకున్న కార్డుల వెనుక వ్కెపు ఉన్న నంబర్లలో మొదటి వరుసలోని మొదటి అంకెలను లెక్కించాలి. వారు 1వ నంబరు కార్డులో 'శారా' అన్న పేరు ఎంచుకున్నట్లయితే, ఆ పేరు 1,2,4 కార్డులలో ఉంది. కాబట్టి ఆ కార్డుల వెనుక వున్న మొదటి వరుసలోని మొదటి నంబర్లు 1,2,8 కలిపితే 11 వస్తుంది. 11 నంబరుకి 'శారా' ఉంటుంది కాబట్టి వాళ్ళు కోరుకుంది 'శారా' అని చెప్పవచ్చు. పిల్లలను పేరు ఎంచుకొనుమని చెప్పేటప్పుడు నంబర్లు లేకుండా పేర్లు మాత్రమే ఉన్నవైపు చూపించాలి. మొత్తం 6 కార్డులలో ఒక్కటి పోయినా గేమ్ ఉపయోగించడానికి వీలు కాదు కాబట్టి 6 కార్డులను జాగ్రత్తగా ఉంచాలి. వీలైనంత వరకు పిల్లల చేతికి ఇవ్వకుండా ఉండటం మంచిది. 

There are no reviews for this product.

Write a review

Note: HTML is not translated!
Bad           Good

Related Products

Bible Quiz Game - బైబిల్ క్విజ్ గేమ్

Bible Quiz Game - బైబిల్ క్విజ్ గేమ్

సండేస్కూలు పిల్లలకు బైబిలు జ్ఞానమును పెంపొందించుటకు ఈ “బైబిల్ క్విజ్ గేమ్” రూపొందించబడింది. ఈ గేమ్లో..

Rs.350
Animals & Birds in Bible Game - యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ బైబిల్ గేమ్

Animals & Birds in Bible Game - యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ బైబిల్ గేమ్

సండేస్కూలు పిల్లలకు బైబిలు జ్ఞానమును పెంపొందించుటకు ఈ 'జంతువులు పక్షుల బైబిల్ గేమ్' రూపొందించబడింది...

Rs.350

Tags: Bible Names Prediction Game,