హదస్సా (ఎస్తేరు చరిత్ర నవల) - Hadassah (Biography of Esther)
- Brand: Bible Literature Ministry
- Product Code: KODA-HADA
- Availability: 49
-
Rs.100
160 పేజీలు
'కొడవటికంటి’గారి కలం నుండి వెలువడిన ఎన్నో రచనలు తెలుగు క్రైస్తవుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. 1992 నుండి 2022 వరకు రెండు దశాబ్దాల పాటు సాగిన ఆయన సాహిత్య ప్రయాణం ఎంతోమంది ఆప్తులను, అభిమానులను ఆయనకు పరిచయం చేసింది. ఆయన రచనలు క్రైస్తవ ప్రపంచంలో ఒక సంచలనం అని చెప్పటం ఏ మాత్రం అతిశయోక్తికాదు. ఎందుకంటే బైబిల్లోని వ్యక్తుల జీవితాలను నవలా రూపకంగా మలచడమంటే అదేమంత చిన్న విషయం కాదు. ముఖ్యంగా ఆయన రచనాశైలి చదువరులను మంత్రముగ్ధులను చేసి, చదువుతున్నంతసేపు ఆ కాలమునకు వెళ్ళి, కథలో మనం కూడా ఒక పాత్ర అనే భావన కలిగేలా చేస్తుంది. 'జన్నత్పనేహు'తో ప్రారంభమైన నవలా సంపుటి ఆసెనతు, అపొస్తలుడు, బర్నబా, తిమోతి, నా స్నేహితుడు (అబ్రాహాము), నా చిత్తానుసారుడు (దావీదు), గోత్రకర్త (యాకోబు), నాజరు (సమ్సోను), నా కుమారి (రూతు), హదస్సా (ఎస్తేరు), నా దూత(యోహాను), సువార్తలలోని యేసుకథ, మిక్కిలి సాత్వికుడు (మోషే) లాంటి వ్యక్తుల జీవితాలను నవలా రూపకంగా వ్రాయగలగటం 'కొడవటికంటి' గారికే సాధ్యమైంది. ఇవేకాక దేవునిపని గురించి 'తోటలో పనివాడు', కుటుంబ వ్యవస్థ గురించి 'నా కుటుంబము', ధనము గురించి 'జీవనమంతయు' అనే పుస్తకాలు కూడా రచించాడు. అలాగే ఆయన జీవితచరిత్రను కూడా మంచి, చెడు ఏదీ దాచకుండా 'విశ్వాసంలో ఓ మెట్టు', 'విశ్వాసంలో మరో మెట్టు', 'విశ్వాసము- విజయము' అను పుస్తకాలలో వ్రాశాడు. సగటు క్రైస్తవుడు తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒడి దుడుకులను అధిగమించడానికి 'కొడవటికంటి'గారి రచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.