Bible Verses Star Game - బైబిల్ వర్సెస్ స్టార్ గేమ్
- Brand: Bible Literature Ministry
- Product Code: BIBLEVERSTR
- Availability: 20
-
Rs.400
చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలుకు ఆకర్షించవచ్చును. అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది. అందులో భాగంగానే ఈ “బైబిల్ వర్సెస్ స్టార్ గేమ్” రూపొందించబడినది. ఈ గేమ్ గ్రూప్ ఆడవలసిన గేమ్. 3 నుండి 8 మంది వరకు గ్రూపుగా ఆడించ వచ్చును ఈ గేమ్లో 8 రంగుల కాయిన్స్ ఉంటాయి. ఒక్కొక్క రంగుకి 13 కాయిన్స్ 13 అక్షరాల బైబిల్ వాక్యాలతో ఉంటాయి. మీరు నలుగురితో గేమ్ ఆడించాలనుకుంటే నాలుగు కలర్స్ కాయిన్స్ మాత్రమే వాడాలి. మీరు గ్రీస్, రెడ్, ఎల్లో, బ్లూ కాయిన్ తీసుకుంటే వాటిని నలుగురికి సమానంగా పంచాలి. అంటే ప్రతి ఒక్కరికీ రెడ్ 3, గ్రీన్ 3, ఎల్లో 3, బ్లూ 3 పంచిన తరువాత మిగిలిన ఒక్కొక్క కాయిన్ తలా ఒకటి ఇవ్వాలి. అందరికీ తలా 13 కాయిన్స్ వచ్చాయో లేదో సరి చూచుకున్న తరువాత గేమ్ ప్రారంభించాలి. వారి దగ్గరున్న 13 కాయిన్స్లో వారు ఒక రంగు ఎంచుకొని 13 కాయిన్స్ ఒకే రంగు వచ్చే వరకు ఎడమ వెపు వారి దగ్గర ఒక కాయిన్ తీసుకుని వారు ఎంచుకున్న రంగు కాకుండా మిగతా రంగు కాయిన్స్లో ఒకటి వారి కుడిప్రక్క వారికి ఒక కాయిన్ ఇవ్వాలి. అలా ఎవరో ఒకరు అన్నీ కాయిన్స్ ఒకే రంగు సేకరించే వరకు గేమ్ కొనసాగుతూ ఉంటుంది. ఎవరైతే అనీ కాయిన్స్ ఒకే రంగు ముందుగా సేకరిస్తారో వారు 'స్టార్' అని చెప్పాలి. తరువాత ఆ 13 కాయిన్స్ మీద ఉన్న అక్షరాలను క్రింద సరైన క్రమంలో పేర్చి దానిలో ఉన్న వాక్యము యొక్కరెఫరెన్స్ చెప్పాలి. రెఫరెన్స్ చెప్తే అప్పుడు మాత్రమే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును. అంతటితో గేమ్ ముగుస్తుంది. ఒకవేళ రెఫరెన్స్ చెప్పలేక పోతే మిగతా ముగ్గురితో గేమ్ కొనసాగించవచ్చును. ఈ గేమ్ గరుకు నేల మీద కాకుండా నున్నటి నేల మీద ఆడాలి. లేదంటే కాయిన్స్ పాడైపోతాయి. కాయిన్స్ నీళ్ళలో తడవటకుండా చూసుకోవాలి. గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత కాయిన్స్ అన్నీ లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్క కాయిన్ పోయినా ఆ రంగు కాయిన్స్ ఉపయోగించటానికి వీలుపడదు. పెద్దవాళ్ళ పర్యవేక్షణలో గేమ్ ఆడటం మంచిది.