Heaven & Hell Memory Verses Game - హెవెన్ అండ్ హెల్ మెమోరి వర్సెస్ గేమ్
- Brand: Bible Literature Ministry
- Product Code: HEVNDHELMEMVER
- Availability: 5
-
Rs.550
చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలుకు ఆకర్షించవచ్చును. అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది. అందులో భాగంగానే ఈ “హెవెన్ అండ్ హెల్ మెమోరి వర్సెస్ గేమ్" రూపొందిచబడింది. ఈ గేమ్ ఆడటానికి ముందే ఇందులో ఇవ్వబడ్డ వాక్యాలన్నీ నేర్చుకొని ఉండాలి. ఈ గేమ్ ఇద్దరు నుండి నలుగురు ఆడవచ్చును. ఈ
గేమ్లో ఒక డైస్ మరియు నాలుగు టోకెన్స్ ఉంటాయి. ఈ గేమ్ ఎంతమంది ఆడతారో అన్ని టోకెన్స్ మాత్రమే ఉపయోగించాలి. సండేస్కూల్ టీచర్ లేదా
పెద్దవాళ్ళు ఈ గేమ్ ఆడించాలి. A,B,C,D అనే నలుగురు పిల్లలతో ఆడించే పనైతే ముందుగా A కోసం డైస్ ని కుదిలించి క్రింద వేసినప్పుడు ఎన్ని చుక్కలైతే కనిపిస్తాయో ఆ నంబరు గడిలో A యొక్క టోకెన్ పెట్టాలి. తర్వాత B కోసం డైస్ ని కుదిలించి క్రింద వేసినప్పుడు ఎన్ని చుక్కలైతే కనిపిస్తాయో ఆ నంబరు గడిలో B యొక్క టోకెన్ పెట్టాలి. | తర్వాత C,D కోసం కూడా అలానే చేయాలి. తర్వాత మళ్ళీ A కోసం డైస్ వేయాలి. ఎవరి టోకెనైనా పైకి వెళ్ళే బాణం గుర్తు ఉన్న గడిలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాక్యమును చెప్పాలి. వాక్యం చెప్పగలిగితే పైకి వెళ్ళే బాణం ఏ గడి దగ్గర ముగుస్తుందో
ఆ గడిలో టోకెన్ పెట్టాలి. ఒకవేళ వాక్యము చెప్పలేకపోతే డైస్ వేసి ఎన్ని చుక్కలైతే వస్తాయో అన్ని గడులు లెక్కించి ఆ గడిలో టోకెన్ పెట్టాలి. ఎవరి టోకెనైనా క్రిందికి వెళ్ళే బాణం గుర్తు ఉన్న గడిలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాక్యమును చెప్పాలి. వాక్యం చెప్పగలిగితే డైస్ వేసి ఎన్ని చుక్కలైతే వస్తాయో అన్ని గడులు లెక్కించి ఆ గడిలో టోకెన్ పెట్టాలి. ఒకవేళ వాక్యం చెప్పలేకపోతే ఆ బాణం ఏ గడి దగ్గర ముగుస్తుందో ఆ గడి దగ్గర వారి టోకెన్ పెట్టాలి. 100వ గడి దగ్గరకు వచ్చిన వారు ఎవరైతే అక్కడ వున్న వాక్యములను చెప్తారో వారు గెలిచి పరలోకమునకు వెళ్ళినట్లు, చెప్పలేకపోతే నరకమునకు వెళ్లినట్లు చెప్పవచ్చును. మీకు సమయం వున్నట్లయితే మిగిలిన ముగ్గురితో గేమ్ కొనసాగించవచ్చు
లేదంటే ముగించవచ్చును. ఈ గేమ్ పెద్దవాళ్ళ పర్యవేక్షణలో ఆడించాలి.