Bible Names Game (Genesis) - బైబిల్ నేమ్స్ గేమ్ (జెనెసిస్)
- Brand: Bible Literature Ministry
- Product Code: BINMGENS
- Availability: 20
-
Rs.450
చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలుకు ఆకర్షించవచ్చును. అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది. అందులో భాగంగానే ఈ “బైబిల్ నేమ్స్ గేమ్” రూపొందించబడినది. ఈ గేమ్ ఆడించడానికి ముందు ఇందులోని పేర్లను పిల్లలతో ఒకటి రెండుసార్లు పలికించాలి. వీలైతే ఇందులోని పేర్లకు సంబంధించిన వ్యక్తుల గురించి ఒకటి రెండు మాటల్లో వివరించడం ద్వారా ఆ వ్యక్తుల గురించి పిల్లలకు తెలుస్తుంది. ఈ గేమ్ ఒక్కొక్కరి ద్వారా లేదా గ్రూప్స్ ద్వారా ఆడించవచ్చును. ఒక్కొక్కరి ద్వారా అయితే 1 లేదా 2 నిమిషాలు, గ్రూప్స్ ద్వారా అయితే 5 నిమిషాలు సమయం నిర్ణయించి ఎవరు ఎక్కువ పేర్లు సేకరించగలిగితే వారు గెలిచినట్లు నిర్ణయించ వచ్చును. వారు పేర్చిన పేర్లలో సరైన స్పెల్లింగ్ ఉన్న వాటినే లెక్కించాలి. ఉదా:- 'అబ్రాహాము' పేరును అబ్రాహము అని పెడితే తప్పు అవుతుంది. అలాగే 'జెబూలూను' పేరును జెబులును అని కాని పేడితే తప్పు అవుతుంది. బైబిలులో ఉన్నట్లుగా స్పెల్లింగ్ ఉండాలి. తద్వారా పిల్లలు కరెక్ట్ స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఇందులో 4, 3, 2 అక్షరాల పేర్లు ఉన్నాయి. మీరు పిల్లలతో 4 లేదా 3 లేదా 2 అక్షరాల పేర్లను పేర్చమని చెప్పవచ్చు. లేదా మీరు పేరు చెప్పడం ద్వారా వారు పేరు సేకరించవచ్చును లేదా వారికి తెలిసిన పేర్లను సేకరించమని చెప్పవచ్చు. మీ సమయాను కూలతనుబట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు గ్రూప్తో ఆడించేపనైతే గ్రూప్లో 5గురి కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి. వారిలో ఒకరు పేర్లు పేరుస్తుంటే మిగతా వారు పేరు సేకరించవచ్చును. ఈ గేమ్ గరుకు నేల మీద కాకుండా నున్నటి నేల మీద ఆడాలి. లేదంటే కాయిన్స్ పాడైపోతాయి. కాయిన్స్ నీళ్ళలో తడవకుండా చూసుకోవాలి. గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత కాయిన్స్ అన్నీ లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్క కాయిన్ పోయినా ఒక పేరు తగ్గుతుంది. పెద్దవాళ్ళ పర్యవేక్షణలో గేమ్ ఆడటం మంచిది.