చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలుకు ఆకర్షించవచ్చును. అంతేకాక బైబిల్ సంబంధిత గేమ్స్ ఆడించడం ద్వారా వారికి బైబిలు జ్ఞానము వస్తుంది. అందులో భాగంగానే ఈ "బైబిల్ ఇండెక్స్ గేమ్” రూపొందించబడింది. ఇందులో బైబిల్లోని 66 పుస్తకాల పేర్లు, పది ఆజ్ఞలు, ధన్యతలు ఉన్నాయి. ఈ గేమ్ ఆడించడానికి ముందు ఇందులోని పుస్తకాలను పిల్లలచేత కంఠత పెట్టించిన తరువాత వారి జ్ఞాపకశక్తిని పరీక్షించవచ్చును. బైబిల్ లోని 66 పుస్తకాల వరుస క్రమమును సరిగా పేర్చడం ద్వారా బైబిల్లోని పుస్తకాల వరుస క్రమమును పిల్లలు గుర్తుపెట్టుకోగలరు. ఈ గేమ్ ఒక్కొక్కరి ద్వారా లేదా గ్రూప్స్ ద్వారా ఆడించవచ్చును. ఒక్కొక్కరి ద్వారా అయితే 1 లేదా 2 నిమిషాలు, గ్రూప్స్ ద్వారా అయితే 5 నిమిషాలు సమయం నిర్ణయించి ఎవరు ఎక్కువ పేర్లు క్రమములో పేర్చగలిగితే వారు గెలిచినట్లు నిర్ణయించవచ్చును. మీ సమయానుకూలతనుబట్టి మీరు నిర్ణయించు కోవచ్చు. మీరు గ్రూప్తో ఆడించే పనైతే గ్రూప్లో 5గురి కంటే ఎక్కువ ఉండకుండా చూడాలి. వారిలో ఒకరు పేర్లు పేరుస్తుంటే మిగతా వారు పేర్లు సేకరించవచ్చును. పిల్లలు పుస్తకాల పేర్లను ఎన్ని పేర్చినా, ఎక్కడి వరకైతే క్రమముగా పేర్చారో అక్కడ వరకే లెక్కించాలి. ఉదా: ఆదికాండము నుండి కీర్తనలు వరకు పేర్చినట్లయితే మొత్తం 19 పుస్తకాల పేర్లు పేర్చినట్లు. అయితే మధ్యలో ఎజ్రా, నెహెమ్యా పుస్తకాలను నెహెమ్యా, ఎజ్రా అని తప్పుగా పేర్చినప్పుడు 2దినవృత్తాంతములు వరకు సరిగ్గా పేర్చినట్లు. కాబట్టి అక్కడ వరకు మాత్రమే లెక్కించాలి. ఈ గేమ్ గరుకు నేల మీద కాకుండా నున్నటి నేల మీద ఆడాలి. గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత అన్నీ లెక్క సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
Related Products
Bible Family Names Game - బైబిల్ ఫ్యామిలి నేమ్స్ గేమ్
చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలు అంటే ఇష్టపడతారు గనుక సండేస్కూల్లో గేమ్స్ ఆడించడం ద్వారా వారిని సండేస్కూలు..
Tags: Telugu Sunday School Material, Activity Books, Bible Stories Books, Coloring Books, Sunday School Moral Stories Books, Sunday School Skits Book, Sunday School Dairy, Memory Verses Book, Sunday School Stickers, Sunday School Table, Sunday School Games, తెలుగు సండేస్కూల్ బుక్స్, యాక్టివిటీ బుక్స్, కలరింగ్ బుక్స్, బైబిల్ స్టోరీస్ బుక్స్, సండేస్కూల్ గేమ్స్, మెమోరి వర్సెస్ బుక్,