|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 34 అధ్యాయము | ||
34 మోషే మోయాబు మైదానము నుండి యెరికో యెదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమున కెక్కెను. | 2 అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును | 3 సోయరు వరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను. | 4 మరియు యెహోవా అతనితో ఇట్లనెను-నీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు. | 5 యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతినొందెను. | 6 బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడ నున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. | 7 మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. | 8 ఇశ్రా యేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. | 9 మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ విూద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. | 10-11 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో | 12 వాటి విషయములోను, ఆ బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇది వరకు పుట్టలేదు. |
||
| Previous | ||