BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము  

32 ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును
భూమండలమా, నా నోటిమాట వినుము.
2 నా ఉపదేశము వానవలె కురియును
నా వాక్యము మంచువలెను
లేతగడ్డివిూద పడు చినుకలవలెను
పచ్చికవిూద కురియు వర్షమువలెను ఉండును.
3 నేను యెహోవా నామమును ప్రకటించెదను
మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.
4 ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము
ఆయన చర్యలన్నియు న్యాయములు
ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.
ఆయన నీతిపరుడు యధార్ధవంతుడు.
5 వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులు కారు; వారు కళంకులు
మూర్ఖతగల వక్రవంశము.
6 బుద్ధిలేని అవివేకజనమా,
ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా?
ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?
ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.
7 పూర్వ దినములను జ్ఞాపకము చేసికొనుము
తరతరముల సంవత్సరములను తలంచుకొనుము
నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును;
నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.
8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు
నరజాతులను ప్రత్యేకించినప్పుడు
ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
9 యెహోవా వంతు ఆయన జనమే
ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.
10 అరణ్యప్రదేశములోను
భీకరధ్వనిగల పాడైన యెడారిలోను
వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపనువలె వాని కాపాడెను.
11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల విూద వాటిని మోయునట్లు
యెహోవా వానిని నడిపించెను.
12 యెహోవా మాత్రము వాని నడిపించెను
అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు.
13 భూమి యొక్క ఉన్నత స్థలముల విూద వాని నెక్కించెను
పొలముల పంట వానికి తినిపించెను
కొండబండ నుండి తేనెను
చెకుముకి రాతి బండనుండి నూనెను
అతనికి జుఱ్ఱించెను.
14 ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను
గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను
గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను.
నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము.
15 యెషూరూను1 క్రొవ్విన వాడై కాలు జాడించెను
నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి.
వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను
తన రక్షణ శైలమును తృణీకరించెను.
16 వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి
హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
17 వారు దేవత్వములేని దయ్యములకు
తామెరుగని దేవతలకు
క్రొత్తగా పుట్టిన దేవతలకు
తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
18 నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి.
నిన్ను కనిన దేవుని మరచితివి.
19 యెహోవా దానిని చూచెను.
తన కుమారుల విూదను కుమార్తెల విూదను క్రోధపడెను
వారిని అసహ్యించుకొనెను.
20 ఆయన ఇట్లనుకొనెను-
నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదను
వారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.
21 వారు దైవము కాని దానివలన నాకు రోషము పుట్టించిరి
తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి
కాబట్టి జనము కాని వారివలన వారికి రోషము పుట్టింతును
అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును.
22 నా కోపాగ్ని రగులుకొనును
పాతాళాగాధము వరకు అది దహించును
అది భూమిని దాటి పంటను కాల్చును
పర్వతముల పునాదులను రవలబెట్టును.
23 వారికి ఆపదలను విస్తరింపజేసెదను
వారివిూద నా బాణములన్నిటిని వేసెదను.
24 వారు కరువుచేత క్షీణించుదురు
మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు
బురదలో ప్రాకు పాముల విషమును
మృగముల కోరలను వారివిూదికి రప్పించెదను.
25 బయట ఖడ్గమును లోపట భయమును
యౌవనులను కన్యకలను శిశువులను నెరసిన తలవెండ్రు కలుగలవారిని నశింపజేయును.
26- వారిని దూరమునకు చెదరగొట్టెదను
27 వారి పేరు మనుష్యులలో లేకుండ చేసెదననుకొందును
వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో
-ఇదంతయు యెహోవా చేసినది కాదు
మా బలముచేత వారిని గెలిచితిమి అని వారనుకొందురేమో
విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
28 వారు ఆలోచనలేని జనము
వారిలో వివేచన లేదు.
29 వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.
30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని యెడల
యెహోవా వారిని అప్పగింపని యెడల
ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును?
ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?
31 వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు
ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
32 వారి ద్రాక్షావల్లి సొదమ ద్రాక్షావల్లి
అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది.
వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు
వాటి గెలలు చేదైనవి.
33 వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము
నాగుపాముల క్రూరవిషము.
34 ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా?
నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?
35 వారి కాలు జారు కాలమున
పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే;
వారి ఆపద్దినము సవిూపించును
వారి గతి త్వరగా వచ్చును.
36 వారి కాధారము లేకపోవును.
37 నిర్భంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును
యెహోవా చూచును
తన సేవకులను గూర్చి సంతాపపడును.
38 నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును.
ఆయన-వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీ యార్పణమైన ద్రాక్షారసమును త్రాగిన వారి దేవత లేమైరి?
వారు ఆశ్రయించిన దుర్గములే
లేచి విూకు సహాయము చేయవచ్చును
వారు విూకు శరణము కానియ్యుడి అని చెప్పును.
39 ఇదిగో నేను నేనే దేవుడను
నేను తప్ప వేరొక దేవుడు లేడు
మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే
గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే
నా చేతిలో నుండి విడిపించు వాడెవడును లేడు
40- నేను తళతళలాడు నా ఖడ్గము నూరి
41 నాచేత న్యాయమును పట్టుకొనిన యెడల
నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను
నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చెదను
రక్తముచేత నా బాణములను మత్తిల్లచేసెదను.
42 చంపబడిన వారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును
శత్రువులలో వీరుల తలలను
నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.

43 జనములారా, ఆయన ప్రజలతో కూడ ఆనందించుడి.
హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును
తన విరోధులకు ప్రతికారము చేయును
తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.
44 మోషేయు నూను కుమారుడైన యెహోషువయు2 ఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి. | 45 మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి | 46 మరల వారితో ఇట్లనెను-విూతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని విూ మనస్సులలో పెట్టుకొని, విూ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను. | 47 ఇది విూకు నిరర్ధకమైన మాట కాదు, ఇది విూకు జీవమే. మరియు విూరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి విూరు దీర్ఘాయుష్మంతులగుదురు. 48-49 ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను- యెరికో యెదుటనున్న మోయాబు దేశమందలి అబారీమను ఈ పర్వతము, అనగా నెబో కొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి | 50 నీ సహోదరుడైన అహరోను హోరు కొండవిూద మృతిబొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండవిూద మృతిబొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. | 51 ఏలయనగా విూరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నావిూద తిరుగుబాటు చేసితిరి. | 52 ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.

1. ఇశ్రాయేలు. 2. హోషేయ.
Previous