BLM
 

 
Previous
  ద్వితీయోపదేశకాండము 29 అధ్యాయము  

29 యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. | 2 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను-యెహోవా విూ కన్నుల యెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనమునకును చేసినదంతయు, అనగా | 3 ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను విూరు కన్నులార చూచితిరి. | 4 అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు విూకిచ్చి యుండలేదు. | 5 నేను విూ దేవుడనైన యెహోవానని విూరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. విూ బట్టలు విూ ఒంటివిూద పాతగిలిపోలేదు; విూ చెప్పులు విూ కాళ్లను పాతగిలిపోలేదు. | 6 విూరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చు చున్నాడు. | 7 విూరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనవిూదికి రాగా | 8 మనము వారిని హతముచేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. | 9 కాబట్టి విూరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. | 10-13 నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా విూలో ముఖ్యులేమి, విూ గోత్రపువారేమి విూ పెద్దలేమి, విూ నాయకులేమి విూ పిల్లలేమి, విూ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును విూరందరు నేడు విూ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. | 14 నేను విూతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోను | 15 ఇక్కడ నేడు మనతో కూడ నుండని వారితోను ఈ నిబంధన ప్రమాణమును చేయుచున్నాను. | 16 మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, విూరు దాటి వచ్చిన జనముల మధ్యనుండి మనమెట్లు దాటివచ్చితిమో విూరెరుగుదురు. | 17 వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను విూరు చూచితిరి గదా. | 18 ఆ జనముల దేవ తలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయే గాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు విూలో ఉండ కుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది విూలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబంధనను విూతో చేయుచున్నాను. | 19 అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. | 20 అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు విూలో నుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని విూద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రింద నుండకుండ తుడిచివేయును. | 21 ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును. | 22 కాబట్టి విూ తరువాత పుట్టు విూ సంతతి వారును దూరదేశము నుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశము యొక్క తెగుళ్లను యెహోవా దానివిూదికి తెప్పించిన సంకటములను చూచి | 23 వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి | 24 -యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. | 25 మరియు వారు-వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించి | 26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్కరించిరి | 27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశము విూదికి తెప్పించుటకు దానివిూద యెహోవా కోపము రవులుకొనెను. | 28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. | 29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

Previous