|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 27 అధ్యాయము | ||
27 మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో ఇట్లనిరి-నేడు నేను విూకు విధించుచున్న ధర్మమును విూరాచరింపవలెను. | 2 విూ దేవుడైన యెహోవా విూకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు విూరు యొర్దాను దాటు దినమున విూరు పెద్దరాళ్లను నిలువబెట్టి వాటివిూద సున్నము పూసి | 3 నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని వాటివిూద వ్రాయవలెను. | 4 విూరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు విూకాజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండవిూద నిలువబెట్టి వాటివిూద సున్నము పూయవలెను. | 5 అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటివిూద ఇనుప పనిముట్టు పడకూడదు. | 6 చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానివిూద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను. | 7 మరియు నీవు సమాధానబలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. | 8 ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని ఆ రాళ్లవిూద బహు విశదముగా వ్రాయవలెను. | 9 మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి - ఇశ్రాయేలీయులారా, విూరు ఊరకొని ఆలకించుడి. | 10 నేడు విూరు విూ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక విూ దేవుడైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. |
11 ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా -విూరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు | 12 బెన్యావిూను గోత్రములవారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండవిూద నిలువవలెను. | 13 రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రముల వారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండవిూద నిలువ వలెను. | 14 అప్పుడు లేవీయులు |
||
| Previous | ||