|
||
| Previous | ||
| ద్వితీయోపదేశకాండము 26 అధ్యాయము | ||
26 నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు | 2 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రధమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి | 3 ఆ దినములలో నుండు యాజకుని యొద్దకు పోయి-యెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. | 4 యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసికొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము నెదుట ఉంచగా | 5 నీవు-నా తండ్రి నశించుచున్న అరావిూ దేశస్థుడు1; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను. | 6 ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనవిూద కఠిన దాస్యము మోపగా | 7 మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. | 8 అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి | 9 యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను. | 10 కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రధమ ఫలములను నేను తెచ్చి యున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి | 11 నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ యింటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను. | 12 పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత | 13 నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని-నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను విూరలేదు, దేనిని మరచిపోలేదు. | 14 నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను. | 15 నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను-పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. | 16 ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటి ననుసరించి నడుచుకొనవలెను. | 17 యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి. | 18 మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు, | 19 తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. 1. సిరియ. |
||
| Previous | ||