BLM
 

 
Previous
  ఆదికాండము 40 అధ్యాయము  

40 అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు యెడల తప్పు చేసిరి | 2 గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల విూద కోపపడి | 3 వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. | 4 ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత | 5 వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. | 6 తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై యుండిరి. | 7 అతడు-ఎందుచేత నేడు విూ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను. | 8 అందుకు వారు-మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితోననగా యోసేపు వారిని చూచి-భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; విూరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. | 9 అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి-నా కలలో ఒక ద్రాక్షావల్లి నా యెదుట ఉండెను; | 10 ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలుండెను; అది చిగిరించినట్టు ఉండెను; దాని పువ్వులు వికసించెను; దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. | 11 మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను; ఆ ద్రాక్షఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పెను. | 12 అప్పుడు యోసేపు-దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు; | 13 ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు | 14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి యీ యింటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. | 15 ఏలయనగా నేను హెబ్రీయులు దేశములో నుండి దొంగిలబడితిని, అది నిశ్చ యము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియు చేయలేదని అతనితో చెప్పెను. | 16 అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను-నేనును కల కంటిని; ఇదిగో తెల్లని పిండి వంటలుగల మూడు గంపలు నా తల విూద ఉండెను. | 17 విూది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండివంటలు ఉండెను. పక్షులు నా తలవిూదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసికొని తినుచుండెను. | 18 అందుకు యోసేపు-దాని భావమిదే; ఆ మూడు గంపలు మూడు దినములు | 19 ఇంక మూడు దినములలోగా ఫరో నీ విూదు నుండి నీ తలను పైకెత్తి మ్రానువిూద నిన్ను వ్రేలాడదీయుంచును. అప్పుడు పక్షులు నీ విూదు నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చెను. 20 మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి | 21 పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నె నిచ్చెను. | 22 మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. | 23 అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.

Previous